![రామ్ చరణ్ కు జోడీగా సాయిపల్లవి](https://static.v6velugu.com/uploads/2023/11/it-seems-sai-pallavi-play-heroine-in-film-directed-by-buchi-babu-sana-starring-ram-charan-as-hero_pkN5qjltwP.jpg)
తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సాయి పల్లవి.. ఓ క్రేజీ ప్రాజెక్టులో నటించబోతోందని ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ సహా పలువురు పేర్లు వినిపించగా.. ఫైనల్‌గా సాయి పల్లవిని ఫిక్స్ చేశారట. ఇప్పటివరకు కమర్షియల్ కథలకు దూరంగా ఉన్న ఆమె.. బుచ్చిబాబు చెప్పిన స్టోరీ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.
ఇందులో తను పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుందట. కోస్తా బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, లయ కూడా కీలక పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. వీటిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్న టీమ్.. రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ పూర్తి చేయగానే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.