ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో బ్రేకింగ్ న్యూస్ ఇది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు ఉన్నట్టుండి హైదరాబాద్ కు పయనమయ్యారా..? మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేకు ఫోన్ చేయడం నిజమేనా..? ఎమ్మెల్యే అనుచరులు ఇది నిజం కాదంటున్నారు..? అసలింతకు ఇందులో వాస్తవం ఏంత..? నిజంగానే కేటీఆర్ వద్ద నుంచి ఫోన్ వస్తే... ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవా తీరు వల్లేనా..? ఇప్పుడు ఇదే చర్చ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది..? అసలింతకు ఏం జరిగింది..?
అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం..
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్..కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావుకు ఏప్రిల్ 5వ తేదీన ఫోన్ చేశారని తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యేను ఆదేశించినట్లు సమాచారం అందుతోంది. దీంతో ఎమ్మెల్యే వనమా హుటాహుటినా హైదరాబాద్ కు వస్తున్నారని చెబుతున్నారు. కొత్తగూడెం నియోజకవర్గం రాజకీయాల్లో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేటీఆర్ ఫోన్ కాల్ రానున్న రాజకీయ తుఫాన్ కు సంకేతమా..? అనే చర్చ మొదలైంది.
ఎమ్మెల్యేకు కేటీఆర్ నుంచి ఫోన్ కాల్ రాలేదని, ఉన్నట్టుండి ఎమ్మెల్యే వనమా హైదరాబాద్ కు వెళ్లడం లేదని ఆయన అనుచరులు, సన్నిహితులు చెబుతున్నారు. వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావును బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెట్టలేకపోవడం వల్లే కేటీఆర్ ఆగ్రహానికి కారణమని వాదనలు వినిపిస్తున్నాయి.
అసలేం జరిగింది..?
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు.. వనమా రాఘవ ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యలకు కారణమయ్యాడని అప్పట్లో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ మధ్య రాఘవ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి హాజరై.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాడు వనమా రాఘవేంద్రరావు. ఈ మధ్య కొత్తగూడెం నియోజకవర్గంలోని రామవరంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వనమా రాఘవ హాజరై... సెంట్రల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే తనయుడికి బీఆర్ఎస్ నాయకులు సన్మానాలు, గజ మాలలతో సత్కారాలు చేసి, ఆయన్ను సంతోష పెట్టారు. ఇది చూసిన చాలామంది పార్టీ కార్యకర్తలే ఆశ్చర్యానికి లోనయ్యారు.
పాల్వంచలో రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబం ఆత్మహత్యలకు కారణమైన యువ నాయకుడు వనమా రాఘవను పార్టీ నుండి సస్పెండ్ చేసినప్పటికీ.. మళ్లీ బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడా..? అనే చర్చ సాగింది. ఎమ్మెల్యే కుమారుడిపై సస్పెన్షన్ వేటు ఎత్తివేశారా..? లేక ఆయనే వచ్చాడా..? అనే చర్చ నియోజకవర్గంలో మొదలైంది. మరోవైపు పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటున్నాడా...? అనే దానిపై కూడా అందరూ చర్చించుకున్నారు. కొంతకాలం నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న రాఘవ... ఉన్నట్టుండి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కనిపించే సరికి పార్టీ నాయకులు.. ఆయన మెప్పు పొందేందుకు తెగ ఆరాటపడ్డారు. సన్మానాలు, ఆత్మీయ పలకరింపులతో హడావుడి చేశారు. అంతేకాదు.. ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల్లోనూ వనమా రాఘవ ఫొటోలు కనిపిస్తున్నాయి.
వనమా రాఘవ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడనే విషయం బీఆర్ఎస్ అధిష్టానం దృష్టికి వచ్చింది. ఇదే ఇష్యూపై చాలా సీరియస్ గా ఉన్న కేటీఆర్.. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుకు ఫోన్ చేశారని సమాచారం. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఎమ్మెల్యే కుమారుడు మరోసారి తెరపైకి రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.