
‘పెళ్లిసందD’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల, ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ దృష్టినీ ఆకట్టుకుంది. దీంతో ఆ సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుస అవకాశాలతో బిజీ అవుతోంది. ఆల్రెడీ రవితేజకి జంటగా ‘ధమాకా’ చిత్రంలో నటిస్తోంది లీల. ప్రస్తుతం స్పెయిన్ షెడ్యూల్‌లో పాల్గొంటోంది. మరోవైపు వైష్ణవ్ తేజ్, నవీన్ పొలిశెట్టి లాంటి యువ హీరోల ప్రాజెక్ట్స్‌తో పాటు ప్రభాస్, మహేష్ బాబు లాంటి స్టార్స్ సినిమాల్లోనూ తన పేరు వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా నితిన్ సినిమాలో కూడా చాన్స్ కొట్టేసింది శ్రీలీల. ఆమధ్య అల్లు అర్జున్‌తో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తీసిన వక్కంతం వంశీ, కొంత గ్యాప్ తర్వాత నితిన్ హీరోగా ఓ సినిమా చేయ బోతున్నాడు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘జూనియర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులోనే నితిన్‌కి జంటగా లీలను తీసుకున్నట్టు తెలిసింది. నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ నిర్మించనున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో మొదలు కానుంది.