హైదరాబాద్‍లో భారీ వర్షం : మరో4రోజులు ఇదే వర్షాలు

హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి 9 గంటలకు వర్షం మొదలైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహిదీపట్నం, లక్డీకాపూల్, కోఠి, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్ లో భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల రోడ్లపై వాననీళ్లు నిలిచిపోయాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోనాలుగు రోజులు వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చించింది. మరో గంటలో నగరంలో భారీవర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. జీహెచ్ఎసీ పరిధిలో దాని చుట్టు పక్కల  ప్రాంతాల్లో కూడా జోరు వాన కురుస్తోంది. సాయంత్రం వరకు ఎండ దంచి కొట్టినా.. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.