గుజరాత్ : ప్రతిపక్షాలు బీజేపీని ఎదుర్కోవాలంటే 50 ఏళ్లు తపస్సు చేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా బీజేపీ తనదైన ముద్ర వేసిందన్నారు. గుజరాత్ లో బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా పర్యటించారు. అహ్మాదాబాద్ విమానాశ్రయంలో పార్టీ నాయకులు నడ్డాకు ఘనస్వాగతం పలికారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, బీజేపీ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ పాటిల్ తో కలిసి గాంధీ ఆశ్రమానికి వెళ్లారు. సబర్మతీ ఆశ్రమంలో చరఖా తిప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.
#WATCH गुजरात: बीजेपी के राष्ट्रीय अध्यक्ष जे.पी.नड्डा ने अहमदाबाद के साबरमती आश्रम में चरखा चलाया। pic.twitter.com/2d4JOreGhr
— ANI_HindiNews (@AHindinews) April 29, 2022
మరిన్ని వార్తల కోసం..