Naveen Polishetty: ఇది నాకు కష్టమైన సమయం..యాక్సిడెంట్ తర్వాత తన పరిస్థితిని వెల్లడించిన హీరో నవీన్ పోలిశెట్టి

Naveen Polishetty: ఇది నాకు కష్టమైన సమయం..యాక్సిడెంట్ తర్వాత తన పరిస్థితిని వెల్లడించిన హీరో నవీన్ పోలిశెట్టి

జాతిరత్నాలు ఫేమ్ హీరో నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty)కి ఇటీవలే అమెరికాలో యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన చేతికి ఫ్రాక్చర్‌ అయిందని సమాచారం బయటికి వచ్చింది.అయితే, అప్పుడు అధికారికంగా నవీన్ పోలిశెట్టి ఏమీ చెప్పలేదు. దీంతో ఏమైందోననే టెన్షన్ ఫ్యాన్స్ లో నెలకొంది.

ఇక ఎట్టకేలకు నవీన్ పోలిశెట్టి తనకు జరిగిన ప్రమాదంపై, ప్రస్తుతం తాను ఉన్న పరిస్థితిపై తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.ఈ ప్రమాదంలో తన చేతికి, కాలికి గాయలయ్యాయని, కోలుకునే ప్రక్రియ కాస్త నెమ్మదిగా సాగుతోందని నవీన్ పోలిశెట్టి వెల్లడించారు. 

ALSO READ | Sardar 2 Shooting: కార్తీ సర్దార్ 2 షూటింగ్ సెట్‌లో ప్రమాదం..ఫైట్ మాస్టర్ మృతి..మరో ఇద్దరికీ గాయాలు

నవీన్ మాటల్లోనే.."ఈ రోజు మీతో నేనొక పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దురదృష్టవశాత్తూ, నా చేతి బోన్ కి తీవ్రమైన మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి, కాలికి కూడా గాయం అయ్యింది. ఇది నాకు చాలా టఫ్ అండ్ పెయిన్ ఫుల్ టైమ్.ముఖ్యంగా క్రియేటివ్ యాంగిల్లో. ఈ గాయం వల్ల నేను ఫాస్ట్ గా మీ ముందుకు నా సినిమాలు తీసుకురాలేకపోతున్నందుకు సారీ.

ALSO READ | Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్

గత కొన్ని రోజులు చాలా టఫ్ గా గడిచాయి. నేను కంప్లీట్ గా రికవర్ అయ్యి, మీకు నా బెస్ట్ ఎనర్జిటిక్ వెర్షన్ ని చూపించడానికి మెడికల్ ప్రొఫెషనల్స్ సహాయంతో వర్క్ చేస్తున్నాను. కానీ దానికి కొన్ని నెలలు టైమ్ పడుతుంది. నేను ముందు కంటే స్ట్రాంగ్గా,హెల్తీగా కమ్ బ్యాక్ అవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాను.

గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు డెవలప్మెంట్లో ఉన్న నా అప్ కమింగ్ ఫిలిమ్ స్క్రిప్ట్ అధ్బుతంగా, మీకు బాగా నచ్చే విధంగా రూపు దిద్దుకుంటున్నాయి.నేను పూర్తిగా రికవర్ అయ్యాక వాటి షూటింగ్ మొదలుపెడతాను. మీ లవ్ అండ్ ఎంకరేజ్మెంట్ యే నాకు అన్నీ.

నేను తిరిగి మీ ముందుకు రావాలన్న ఆశకి అవే మోటివేషన్. మీ సపోర్ట్కీ,పేషన్స్కీ చాలా థాంక్స్. అతి త్వరలో నేను మళ్ళీ స్క్రీన్ మీద కనిపించి,మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. మీరు ఎప్పటిలాగే నా మీద మీ ప్రేమని కురిపించడానికి సిద్ధంగా ఉంటారని అనుకుంటున్నాను..మీ లవ్ జిగర్ నవీన్ పోలిశెట్టి" అంటూ పోస్ట్ చేశారు. ఇక నవీన్ పోలిశెట్టి ప్రమాదం గురించి తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నారు. గాయాల నుండి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.  

ALSO READ | King Movie: షారుక్‌కు విలన్‌గా అభిషేక్‌ బచ్చన్..రూమర్స్‌కు చెక్‌ పెడుతూ బిగ్ బి పోస్ట్

నవీన్ పోలిశెట్టి సినిమాల విషయానికి వస్తే..ఇటీవలే మిస్ శెట్టి మిస్టర్ పిలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నవీన్ డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తరువాత అనగనగా ఒకరాజు అనే సినిమా చేస్తున్నారు నవీన్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కాకుండా మరో రెండు క్రేజీ సినిమాలను కూడా లైన్లో పెట్టాడు నవీన్ పోలిశెట్టి.