పటాకులు పేల్చొద్దంటే వృద్ధుడ్ని కొట్టి చంపిన యువకులు

పటాకులు పేల్చొద్దంటే వృద్ధుడ్ని కొట్టి చంపిన యువకులు

దీపావళి పండగ పూట ఓ అమానుష్య ఘటన చోటుచేసుకుంది. క్రాకర్స్ పేల్చొద్దు అని అభ్యంతరం చెప్పిన వృద్ధున్ని కొందరు యువకులు కొట్టి చంపారు. అర్థరాత్రి తర్వాత కూడా భారీ శబ్ధాలతో పటాకులు కాల్చుతుంటే యువకులపై మండిపడ్డాడు ఆ వృద్ధుడు. ఈ క్రమంలో ముగ్గురు యువకులు ఆవేశంలో అతన్ని తీవ్రంగా కొట్టారు. వారు కొట్టిన దెబ్బలు భరించలేక వృద్ధుడు మరణించాడు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది.

బాధితుడు చనిపోయాడని తెలియగానే నిందితులు రాజు, ధీరజ్, నందు అక్కడి నుంచి తప్పించుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.  గురువారం రాత్రి దీపావళి సందర్భంగా ఫరీదాబాద్ సెక్టార్ 18లోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ముగ్గురు యువకులు ఒక ఇంటి ముందు బాణసంచా పేల్చారు. ఓ పెద్దాయన అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారి మధ్యం వాగ్వాదం జరిగింది. అర్ధరాత్రి తర్వాత యువకులు మళ్లీ ఆ ఇంటి ముందు పటాకులు కాల్చారు. దీంతో వారికి పెద్దాయనతో గొడవ అయ్యింది. ముగ్గురు వ్యక్తులు వృద్ధుడ్ని కొట్టారు. అడ్డుకోవడానికి వస్తే అతని కొడుకు, కోడలును కూడా తిట్టారు. వారు కొట్టిన దెబ్బలకు తాళలేక ఆ వృద్ధుడు మరణించాడు. దీంతో అతడి కుమారుడు వినోద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.