గ్రేటర్ హైదరాబాద్‌లో మళ్లీ వర్షం షురూ..

గ్రేటర్ హైదరాబాద్‌లో మళ్లీ వర్షం షురూ..

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని  పలు ప్రాంతాల్లో సోమవారం (సెప్టెంబర్ 23) సాయంత్రం వర్షం కురవడం మొదలైంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉద్యోగులు, విద్యార్థులు ఇంటికి వెళ్లే సమయం కాబట్టి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం వరకు ఎండ ఉన్నప్పటికీ ఒక్కసారిగా మేఘాకృతమై ఫుల్ గా వర్షం పడుతోంది. అటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలతోపాటు మలక్ పేట, దిల్ షుఖ్ నగర్, కాచిగూడ, సైదాబాద్, చాదర్ ఘాట్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిస్తోంది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే టైం కావడంతో భారీగా ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రోడ్లపై నీరు నిలిచింది.

అబిడ్స్, కోఠి, నారాయణగూడలో వర్షం దంచికొడుతుంది. పంజాగుట్ట, కూకట్ పల్లి, ఎస్ఆర్ నగర్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి. మంగళవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.సెప్టెంబర్ 24న 14 జిల్లాలకు భారీ వర్షసూచన ఉందని.. వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నుంచి మరో నాలుగురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

ALSO READ | రెండ్రోజులు అప్రమత్తంగా ఉండాలి