కుండపోత వర్షానికి.. చైతన్యపురి, కొత్తపేట వీధుల్లో వరద

కుండపోత వర్షానికి.. చైతన్యపురి, కొత్తపేట వీధుల్లో వరద

హైదరాబాద్ సిటీలో ఎప్పుడు.. ఎంత వర్షం పడుతుందో ఎవరికీ అర్థం కావటం లేదు. అప్పటికప్పుడు మారిపోతున్న వాతావరణంతో.. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం పడుతుంది. 2024, సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం సాయంత్రం.. హైదరాబాద్ సిటీలోని కొత్తపేట, చైతన్యపురి ఏరియాల్లో కుండపోత వాన పడింది. గంటపాటు దంచికొట్టింది. అలా ఇలా కాదు.. ముందు, వెనక ఎవరు ఉన్నారో కూడా తెలియనంతగా వర్షం పడింది.

ALSO READ | గ్రేటర్ హైదరాబాద్‌లో మళ్లీ వర్షం షురూ..

కుండపోత వర్షానికి చైతన్యపురి, కొత్తపేట ఏరియాల్లోని వీధులు అన్నీ జలమయం అయ్యాయి. ఇవి రోడ్లా లేక నదులా అన్నట్లు మోకాళ్ల లోతు నీళ్లు ప్రవహించాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం.. పిల్లలు స్కూల్స్, ట్యూషన్ల నుంచి ఇంటికి చేరే సమయం కావటంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

వీధుల్లో మోకాళ్ల లోతు నీటితో వాహనదారులు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడ మ్యాన్ హోల్ ఉంది.. ఎక్కడ గుంతలు ఉన్నాయి అనేది తెలియక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల వాహనాలు నీటిలో మునిగిపోయాయి. రోడ్లపై వెళుతున్న వాహనాలు ఆగిపోయాయి. దీంతో వాహనదారులు.. జోరు వర్షంలో.. మోకాళ్ల లోతు నీటిలోనే తోసుకు వెళ్లటం కనిపించింది.