
ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణా జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయి. ఆదివారం (జూన్ 3) మధ్యాహ్నం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అధికారులను అప్రమత్తం చేసింది.