ఇక బుర్రలతో పని లేదా : ప్రపంచంలోనే తొలి AI న్యూస్ పేపర్

ఇక బుర్రలతో పని లేదా : ప్రపంచంలోనే తొలి AI న్యూస్ పేపర్

ప్రపంచంలో మొదటిసారి పూర్తిగా కృత్రిమ మేధతో (AI) వార్తా పత్రికను ఇటాలియన్​ వార్తా సంస్థ ఫాగియో ప్రచురించింది. AI.. ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ప్రభావం జర్నలిస్టులు, పత్రికల పనితీరుపై ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేందుకు నెల రోజులపాటు ప్రయోగాత్మకంగా పూర్తి ఏఐ టెక్నాలజీని ఉపయోగించి దిన పత్రికను రూపొందించింది. 

ఏఐ టెక్నాలజీతో తయారైన నాలుగు పేజీల ఎడిషన్ మార్కెట్​తోపాటు ఆన్ లైన్ లో కూడా విడుదలైంది. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. AI కారణంగా భవిష్యత్తులో జర్నలిస్టుల పాత్ర చాలా పరిమితమయ్యే అవకాశం ఉన్నది. పత్రికా పరిశ్రమలో ఏఐని ఏ విధంగా ఉపయోగించాలని ప్రపంచవ్యాప్తంగా వార్తా సంస్థలు ఆలోచిస్తున్న సమయంలో ఇటాలియన్ వార్తాపత్రిక ఈ ప్రయోగం చేసింది.

ఏఐ పత్రిక అయితే వచ్చింది.. అంతే వరకు బాగానే ఉన్నా.. ఏఐను సమర్థవంతంగా ఉపయోగించే.. దాన్ని డ్రైవ్ చేయగలిగే సామర్థ్యం ఎంత మందికి ఉన్నది అనేది ఇప్పుడు టెక్ నిపుణులు.. డిజిటల్ జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. ఏఐ ఇచ్చిన కంటెంట్ లో వాస్తవం ఎంత ఉంది.. ఆ డేటా ఉన్న విలువ ఎంత అనేది కూడా పరిశీలించాల్సిన అంశంగా చెబుతున్నారు డిజిటల్ జర్నలిస్టులు. నిన్నటి వరకు ఏఐ బాగుంటుంది.. రేపటి సంగతిని ఏఐ ఎలా చెబుతుంది.. రేపటి మార్పును కచ్చితంగా అంచనా వేయగలదా అనేది కూడా పరిశీలించాల్సిన అంశమే. ఏఐతో తీసుకొచ్చిన తొలి దిన పత్రిక ఎంత వరకు సెక్సెస్ అవుతుంది అనేది కూడా భవిష్యత్ లో చూడాలి.