
దేశంలో జూన్ 4గా వెల్లడైన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి 293 సీట్లు సాధించింది. దీంతో మూడోసారి ఎన్డీఏ కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. సింగిల్ గా భారతీయ జనతా పార్టీ 241 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, మిత్రపక్షాలతో కలిసి మేజిక్ ఫిగర్ 272 సీట్లను దాటేయడంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. మోదీ.. ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా మోదీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.
"కొత్త ఎన్నికల విజయంపై నరేంద్ర మోడీకి అభినందనలు. గుడ్ వర్క్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇటలీ, భారతదేశాల స్నేహాన్ని బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి, వివిధ సమస్యలపై పరస్పర సహకారం అందించుకునేందుకు మేము కలిసి పని చేస్తూనే ఉంటాము" అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
కాగా, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై జూన్ 5వ తేదీ బుధవారం ఢిల్లీలో మిత్ర పక్షాలతో బీజేపీ సమావేశం కానుంది.