ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 545 ఖాళీలను భర్తీ చేయనుంది. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఐటీబీపీ ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 6వ తేదీలోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. వయసు 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. నెలకు పే స్కేల్ రూ.21,700-నుంచి రూ.69,100 చెల్లిస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), రాత పరీక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ALSO READ : Good News : ఇంటర్ పాసైతే చాలు.. రైల్వేలో 3 వేల 445 ఉద్యోగాలకు నోటిఫికేషన్
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నవంబర్ 6 వరకు దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు ఫీజు లేదు. వివరాలకు www.recruitment.itbpolice.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి.