ఐటీబీపీ​లో కానిస్టేబుల్​ కొలువులు

ఐటీబీపీ​లో కానిస్టేబుల్​ కొలువులు

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) వివిధ విభాగాల్లో కానిస్టేబుల్ (పైనీర్‌‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. దీని ద్వారా 200 ఖాళీలను భర్తీ చేయనుంది. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఐటీబీపీ ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది.

ఖాళీలు: మొత్తం 200 ఖాళీల్లో కానిస్టేబుల్ (కార్పెంటర్) (పురుషులు): 61, కానిస్టేబుల్ (కార్పెంటర్) (మహిళలు): 10, కానిస్టేబుల్ (ప్లంబర్) (పురుషులు): 44, కానిస్టేబుల్ (ప్లంబర్) (మహిళలు): 8, కానిస్టేబుల్ (మేసన్) (పురుషులు): 54, కానిస్టేబుల్ (మేసన్) (మహిళలు): 10, కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్) (పురుషులు): 14, కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్) (మహిళలు): 1 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతితో పాటు ఐటీఐ (మేసన్/ కార్పెంటర్/ ప్లంబర్/ ఎలక్ట్రీషియన్ ట్రేడ్) ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి. వయసు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.21,700 నుంచి -రూ.69,100 చెల్లిస్తారు.
సెలెక్షన్​ ప్రాసెస్​: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌‌టీ), రాత పరీక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ట్రేడ్‌‌ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్​ ప్యాటర్న్​: ఆబ్జెక్టివ్​ టైప్‌‌ పద్ధతిలో పదో తరగతి సిలబస్‌‌ ఆధారంగా 100 ప్రశ్నలు (100 మార్కులు) అడుగుతారు.  
దరఖాస్తులు: ఆన్​లైన్​లో సెప్టెంబర్​ 10 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.recruitment.itbpolice.nic.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.