25 కిలోమీటర్లు శవాన్ని మోసుకెళ్లిన ఐటీబీపీ జవాన్లు

25 కిలోమీటర్లు.. 8 గంటలు పాటు

ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌లోని పిథోర్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో సంఘటన

న్యూఢిల్లీ: ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించాడు. వానల వల్ల రోడ్లన్నీ బ్లాక్‌‌‌‌‌‌‌‌ అయిపోయాయి. వెహికల్స్‌‌‌‌‌‌‌‌ వెళ్లకుండా దారులన్నీ మూసుకుపోయాయి. అదే టైమ్‌‌‌‌‌‌‌‌లో అక్కడి జవాన్లు తామున్నామని ముందుకొచ్చారు. మృతదేహాన్ని భుజానికెత్తుకొని 8 గంటలు నడిచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్యామిలీకి అప్పగించారు. ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రంలోని పిథోర్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఆగస్టు 30న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా తెలిసింది. జిల్లాలోని మున్సియారి గ్రామానికి చెందిన భూపేంద్ర సింగ్‌‌‌‌‌‌‌‌ (30) పోనీ ఆపరేటర్‌‌‌‌‌‌‌‌గా పని చేస్తుంటాడు. ఎత్తైన ప్రాంతాల్లో పని ఉంటుండటం వల్ల తన వెంట రేషన్‌‌‌‌‌‌‌‌ కార్డుతో పాటు ఇతర అవసరమైన పరికరాలు వెంట తీసుకెళ్తుండేవాడు. ఆగస్టు 28న స్యుని ప్రాంతంలో రాళ్లను పగులగొట్టడానికి బ్లాస్టింగ్‌‌‌‌‌‌‌‌ చేయగా ప్రమాదవశాత్తు ఓ రాయి తగిలి చనిపోయాడు. అక్కడ శవం ఉన్న విషయాన్ని స్థానికులు దగ్గర్లోని ఐటీబీపీ సిబ్బందికి తెలిపారు. 8 మంది జ‌‌‌‌‌‌‌‌వాన్లు ఆగస్టు 30న పొద్దున 11.30 గంటలకు మృత‌‌‌‌‌‌‌‌దేహాన్ని భుజాల‌‌‌‌‌‌‌‌పైకి ఎత్తుకొని నడక ప్రారంభించారు. 8 గంట‌‌‌‌‌‌‌‌ల పాటు 25 కిలోమీటర్లు నడిచి సాయంత్రం 7.30 గంటలకు మున్సియారి గ్రామానికి చేరుకున్నారు. ఫ్యామిలీకి మృతదేహం అప్పగించారు.

For More News..

తండ్రి శవాన్ని సైకిల్‌పై తీసుకెళ్లి అంత్యక్రియలు చేసిన కొడుకు

పీఎం కేర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 5 రోజుల్లో 3 వేల కోట్లు

వొడాఫోన్ ఐడియా నిలుస్తుందా?