ఎముకలు కొరికే చలిని తట్టుకోవడం, విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుపోయిన పౌరులను రక్షించడం.. ఏదైనా సరే దేశంపై భారత ఆర్మీ చూపే అంకితభావం ప్రశంసనీయం. దేశ రక్షణ కోసం ఎటువంటి వాతావరణాన్నీ లెక్కచేయని సైనికులు.. కాస్త విరామం దొరకడంతో వాలీబాల్ ఆడారు. సిక్కింలోని బోర్డర్ అవుట్ పోస్ట్ దగ్గర 14 వేల ఫీట్ల ఎత్తులో ఇండో–టిబెటన్ పోలీసులు వాలీబాల్ ఆడారు. మోకాల్లోతు మంచులో జవాన్లు వాలీబాల్ ఆడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంచు కురుస్తున్నా సరదాగా కాసేపు గడిపారు. కాగా, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రంగా మంచు కురుస్తోంది. అక్కడ ప్రస్తుతం మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది.
మరిన్ని వార్తల కోసం: