ఆన్ లైన్ లోకి ఐటీసీ

ఆన్ లైన్ లోకి ఐటీసీ

న్యూఢిల్లీ: తాజాగా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఎఫ్‌‌‌‌‌‌‌‌డీఐ నిబంధనలు దేశీయ ఈ–కామర్స్‌‌‌‌‌‌‌‌  సంస్థలకు అనుకూలంగా ఉండటంతో ఈ అవకాశాన్ని ఉపయోగించు కోవాలని ప్రముఖ ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎంసీ జీ కంపెనీ ఐటీసీ నిర్ణయించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆన్‌ లైన్‌ సేల్స్‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్‌ లో తమ వాటాను పెంచు కోవడానికి సొంతగా ఈ–కామర్స్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభిం చే ఆలోచనలో ఉంది. ఇందులో ఎక్కువగా ప్రీమియం ప్రొడక్స్‌ట్ ను అమ్ము తామని ఐటీసీ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ సుమంత్‌ వెల్లడించారు. మనదేశంలో 98 శాతం మంది వినియోగదారులకు ఇంటర్నెట్‌ యాక్సెస్‌ ఉండటంతో

గత రెండేళ్లలో ఆన్‌ లైన్‌ లో ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎంసీ జీ అమ్మకాల్లో ఈ–-కామర్స్‌‌‌‌‌‌‌‌ వాటా మూడురెట్లు పెరిగిందని నీల్సన్‌ సంస్థ చేసిన సర్వే వెల్లడించింది. ఈ–కామర్స్ కోసం కంపెనీ ఇటీవల ఐటీసీస్టోర్‌‌‌‌‌‌‌‌డాట్‌ ఇన్‌ పే రుతో వెబ్‌ సైట్‌ ప్రారంభించింది. త్వరలో ఇందులో ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎంసీ జీ (ఫాస్ట్‌ మూవబు ల్‌ కన్జూమర్‌‌‌‌‌‌‌‌ గూడ్స్‌‌‌‌‌‌‌‌)తోపాటు ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎంసీ జీయేతర వస్తువులనూ అమ్మనుంది.  ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఈ సైట్లో ఫేబిల్‌ బ్రాండ్‌ చాక్లెట్స్‌‌‌‌‌‌‌‌ మాత్రమే అమ్ముతోం ది. ఖరీదైన వస్తువుల అమ్మకాలు ఎక్కువగా ఉండే మెట్రో నగరాలకు మాత్రమే ప్రస్తుతం డెలివరీ ఇస్తామని, చిన్న పట్టణాలకు సేవలు ఉండబోవని సుమంత్‌ అన్నా రు. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ , కోల్‌ కతాలో మాత్రమే సరుకులను డెలివరీ చేస్తామని చెప్పారు. వినియోగదారుల స్పందన బాగుంటే మిగతా పట్టణాల్లోనూ ఈ–కామర్స్‌‌‌‌‌‌‌‌ సేవలను మొదలుపెడతామన్నా రు.