సీఐఐ కొత్త ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఐటీసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎండీ సంజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సీఐఐ కొత్త  ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఐటీసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎండీ సంజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఐటీసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎండీ సంజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూరి కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) కి ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎన్నియ్యారు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఆయనీ బాధ్యతలు స్వీకరించారు. టీవీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సొల్యూషన్స్ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఆర్ దినేష్ ఇప్పటి వరకు సీఐఐ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సేవలందించారు.  ఎఫ్ఎంసీజీ, హోటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ ప్యాకేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అగ్రి బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఐటీ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐటీసీ ఉంది. 

ఈ కంపెనీ సబ్సిడరీ ఐటీసీ ఇన్ఫోటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియాకు, సూర్య నేపాల్ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  కూడా చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సంజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూరి పనిచేస్తున్నారు. ఎర్నస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ యంగ్ (ఈవై) ఇండియా చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెమాని  2024–25 కి గాను సీఐఐ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెజిగ్నేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎన్నికయ్యారు. టాటా కెమికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎండీ, సీఈఓ ఆర్ ముకుందన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌   సీఐఐ వైస్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎన్నికయ్యారు.