ఐటీసీ హోటల్స్ 30శాతం డౌన్‌‌

ఐటీసీ హోటల్స్ 30శాతం డౌన్‌‌

న్యూఢిల్లీ: ఐటీసీ నుంచి  విడిపోయిన ఐటీసీ హోటల్స్ షేర్లు మంగళవారం ఎక్స్చేంజీల్లో లిస్టయ్యాయి. ​ఐదు శాతం నష్టంతో 178.60 వద్ద ముగిశాయి. డిస్కవర్డ్ ప్రైస్​ కంటే 30 శాతం డిస్కౌంట్​తో లిస్టయ్యాయి. ఎన్​ఎస్​ఈలో డిస్కవర్డ్ ​ప్రైస్​ రూ.260 కాగా, బీఎస్​ఈలో రూ.270గా నమోదయింది. 

బీఎస్ఈలో ఐదు శాతం, ఎన్​ఎస్​ఈలో 3.53 శాతం నష్టంతో ముగిశాయి. ఇదిలా ఉంటే రాబోయే ఐదేళ్లలో హోటళ్ల సంఖ్యను రెట్టింపు చేసి 200లకు చేర్చుతామని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఐటీసీ హోటల్స్​కు 90 ప్రాంతాల్లో 140 ప్రాపర్టీలు ఉన్నాయి. వీటిలో 13 వేల గదులు ఉన్నాయి. లిస్టింగ్​తరువాత ఐటీసీ వద్ద ఐటీసీ హోటల్స్​లో 40 శాతం వాటా, మిగిలినది షేర్​హోల్డర్ల వద్ద 
ఉంటుంది.