ములుగు/మంగపేట, వెలుగు : కమలాపూర్ బిల్ట్ ఫ్యాక్టరీకి సంబంధించిన రెవెన్యూ రికార్డులను ఐటీసీ కంపెనీ ప్రతినిధులు శుక్రవారం పరిశీలించారు. ములుగులో కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి పలు అంశాలపై చర్చించారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురంలో గల బిల్ట్ ఫ్యాక్టరీ ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉంది,
సర్వే నంబర్లు, ఇతర వివరాలు తెలుసుకున్నారు. ఐటీసీ ఫైనాన్స్ జీఎం అవినాశ్ జౌరి, లీగల్ జీఎం అమిత్‌కుమార్, డిప్యూటీ జీఎం డాక్టర్ ఉషారాణి, ఆకాశ్‌జైన్, కలెక్టరేట్ ఇన్‌చార్జి ఏవో ప్రసాద్ ఉన్నారు. అనంతరం కమలాపురంలోని బిల్ట్ ఫ్యాక్టరీ బార్డర్స్, గోదావరి నుంచి ప్లాంట్‌కు వచ్చే వాటర్ పైప్‌లైన్‌ను పరిశీలించారు.