గోపాలకృష్ణ థియేటర్ ​సెంటర్​లో .. ఆదివాసీ కాఫీ సెంటర్​ ప్రారంభం

గోపాలకృష్ణ థియేటర్ ​సెంటర్​లో .. ఆదివాసీ కాఫీ సెంటర్​ ప్రారంభం

భద్రాచలం, వెలుగు : స్థానిక గోపాలకృష్ణ థియేటర్ ​సెంటర్​లో బుధవారం ఐటీడీఏ ఏపీవో జనరల్​ డేవిడ్​రాజ్​ఆదివాసీ కాఫీ సెంటర్​ను ప్రారంభించారు. పాతతరం ఆదివాసీ గిరిజనులు అడవుల్లో సహజంగా, ప్రకృతిపరంగా దొరికే కరక్కాయలతో పొడి చేసుకుని కల్తీ లేని స్వచ్ఛమైన తేనీరు సేవించి వంద సంవత్సరాలు పైనే జీవించారని డేవిడ్​రాజ్​ అన్నారు. 

ఈ కాఫీ సెంటర్​ ద్వారా ఆదివాసీ మహిళలు జీవనోపాధి పొందేందుకు ఐటీడీఏ చేయూతనందిస్తోందని తెలిపారు. రాగి దోశ ఇతర ఆహారపదార్థాలను ఆయన పరిశీలించారు.