భద్రాచలం, వెలుగు : గిరిజన మహిళలు ఏర్పాటు చేసుకున్న చిన్న తరహా పరిశ్రమలు మూతపడిన నేపథ్యంలో వారికి చేయూతనిస్తున్నట్లు పీవో బి.రాహుల్ తెలిపారు. తన చాంబరులో మంగళవారం ఆయన భద్రాచలంలోని న్యూట్రిమిక్స్, లక్ష్మీనగరం(దుమ్ముగూడెం)లోని చిక్కి, తుమ్మలచెరువు(అశ్వాపురం) దాల్మిల్ యూనిట్లుకు ఒక్కో యూనిట్‌కు రూ.5లక్షల చొప్పున మొత్తం రూ.15లక్షల చెక్కులను అందజేశారు.
వీటిని పునరుద్ధరించుకుని గిరిజన మహిళలు జీవనోపాధి పొందాలని సూచించారు. తీసుకున్న డబ్బులను నెలవారీగా చెల్లించాలని కోరారు. మహిళలంతా ఐకమత్యంగా ఉండి పరిశ్రమలను లాభాల బాటలోకి తెచ్చుకోవాలన్నారు.