భద్రాచలంలో ఐటీడీఏ పాలకమండలి సమీక్ష సమావేశం

భద్రాచలంలో ఐటీడీఏ పాలకమండలి సమీక్ష సమావేశం

నూతన ప్రభుత్వంలో 2024 ఫిబ్రవరి 18 ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ పాలకమండలి సమీక్ష సమావేశం నిర్వహించారు. 20 నెలల తరువాత ఈ సమావేశం నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. 

ఇల్లందు ఆశ్రమ పాఠశాలల భవనాలు ఇంకా ఎందుకు పూర్తి చేయలేదని.. ట్రైబల్ డిడిని ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రశ్నించారు. అధికారులతో కలసి ఆ భవనాన్ని సందర్శించి.. త్వరిత గతిన ఈ సమస్యను పూర్తిచేయాలని తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. 

ఇప్పటి వరకు ఐటీడీఏ పేద గిరిజనులకు అందుబాటులో లేకుండా ఐటీడీఏ ని మరచిపోయే అవకాశం ఉందని కొత్తగూడెం ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేద గిరిజన వర్గాలకు అన్ని రంగాలలో చేయూతగా నిలవాలని కునంనేని సాంబశివరావు అన్నారు.