వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి

ఏటూరునాగారం, వెలుగు : ములుగు జిల్లా కన్నాయిగూడెం పీహెచ్‌‌‌‌సీ, నూగూరు వెంకటాపురంలోని సీహెచ్‌‌‌‌సీని ఐటీడీఏ పీవో అంకిత్‌‌‌‌ గురువారం తనిఖీ చేశారు. కన్నాయిగూడెం పీహచ్‌‌‌‌సీలో రిజిస్టర్‌‌‌‌ను పరిశీలించారు. వైద్యాధికారి పర్మిషన్‌‌‌‌ లేకుండా గైర్హాజర్‌‌‌‌ కావడంతో మెమో జారీ చేయాలని ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌‌‌‌వో కోరం క్రాంతిని ఆదేశించారు. వెంకటాపురం సీహెచ్‌‌‌‌సీని పరిశీలించి సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.