మేడారం భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి : అంకిత్‌‌

తాడ్వాయి, వెలుగు : మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబద్ధత, అంకితభావంతో పనిచేయాలని ఐటీడీఏ పీవో అంకిత్‌‌ ఆదేశించారు. మేడారం జాతరలో డ్యూటీ నిర్వహించనున్న సెక్టోరియల్‌‌ ఆఫీసర్లు, సిబ్బందికి శుక్రవారం స్థానిక స్కూల్‌‌లో ట్రైనింగ్‌‌ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ జాతరను సక్సెస్‌‌ చేసేందుకు ఆఫీసర్లు కృషి చేయాలని చెప్పారు.

జంపన్న వాగు వద్ద డ్యూటీ చేసే సిబ్బంది అలర్ట్‌‌గా ఉండాలని చెప్పారు. శానిటేషన్‌‌ పనులను నిరంతరం కొనసాగించాలని, దుర్వాసన రాకుండా ఎప్పటికప్పుడు క్లీన్‌‌ చేయాలని చెప్పారు. సెక్టార్లను డిపార్ట్‌‌మెంట్ల వారీగా విభజించుకొని షిఫ్టుల వారీగా డ్యూటీ చేయించాలన్నారు.

ప్లాస్టిక్‌‌ నిషేదాన్ని కచ్చితంగా అమలుచేయాలన్నారు. జాతర నిర్వహణను ప్రతి ఆఫీసర్‌‌ ఛాలెంజ్‌‌గా తీసుకోవాలని, గతంలో కంటే మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌‌ కలెక్టర్‌‌ వేణుగోపాల్, స్పెషల్‌‌ డిప్యూటీ కలెక్టర్ వెంకన్న, డీఎంహెడ్‌‌వో అప్పయ్య, అసిస్టెంట్‌‌ ప్రాజెక్ట్‌‌ ఆఫీసర్‌‌ వసంతరావు పాల్గొన్నారు.