ఆర్థికంగా లాభాల బాటలో నడవాలి : ఐటీడీఏ పీవో రాహుల్​

ఆర్థికంగా లాభాల బాటలో నడవాలి : ఐటీడీఏ పీవో రాహుల్​
  • ఐటీడీఏ పీవో రాహుల్​

భద్రాచలం, వెలుగు : ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గిరిజన యువత సద్వినియోగం చేసుకుని, స్వశక్తితో కుటీర పరిశ్రమలు పెట్టుకుని పది మందికి ఉపాధి చూపించడమే కాకుండా ఆర్థికంగా లాభాల బాటలో నడవాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ సూచించారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భవానీ సెంట్రింగ్​యూనిట్​ను ఆయన శనివారం ప్రారంభించి మాట్లాడారు. రూ.15లక్షల సబ్సిడీతో రూ.25లక్షల ఖర్చుతో ప్రారంభించిన ఈ యూనిట్​ను యువకులు ఉపయోగించుకోవాలన్నారు.

 మార్కెటింగ్​ సౌకర్యం గురించి బెనిఫిషర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇటుకలను తయారు చేయడమే కాకుండా, తాపీ మేస్త్రీలతో సత్సంబంధాలు పెట్టుకుని, సకాలంలో వారికి ఇటుకలు సరఫరా చేయాలని సూచించారు. ఇటుకలు రవాణా చేసేందుకు ట్రాలీ ఆటోను బెనిఫిషర్లకు ఇచ్చారు. బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించాలని వారికి సూచించారు. సిమెంట్​ ఇటుకలు తయారు చేసే మిషన్​, సామగ్రిని పరిశీలించి, ఇటుకలు రవాణా చేసే వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో జనరల్​ డేవిడ్​రాజ్, ఏటీడీవో అశోక్​కుమార్, జేడీఎం హరికృష్ణ, యూనిట్​ సభ్యులు రాజు, వెంకటమ్మ, మహేశ్వరీ, వెంకటమ్మ, నాగరాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.