పూసుగుంటలో వసతులు కల్పించాలి : పీవో బి.రాహుల్​

పూసుగుంటలో వసతులు కల్పించాలి : పీవో బి.రాహుల్​

భద్రాచలం, వెలుగు : పూసుగుంట కొండరెడ్ల గ్రామంలో గిరిజనులకు మౌలిక వసతులు కల్పించాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్​ అధికారులను ఆదేశించారు. తన చాంబరులో బుధవారం ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరెంటు, రోడ్డు పనులు  ప్రారంభించాలని సూచించారు. నీటి వసతి కోసం బోర్లు తవ్వించాలని, కరెంట్ సరఫరా ఇవ్వాలన్నారు. మోటార్లు ఇస్తామని, కరెంట్​ లైన్​ కోసం ఆదివాసీలకు ఐటీడీఏ ద్వారా  30 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. 

ఆయిల్​పామ్ తో పాటు అంతరపంటగా జొన్న, బొబ్బర్లు, కొండజొన్నలు సాగు చేసేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఏపీవో జనరల్​ డేవిడ్​ రాజ్, ట్రాన్స్ కో ఎస్ఈ మహేందర్​రెడ్డి, ఏడీ వెంకటరత్నం, జిల్లా ఉద్యానవనశాఖాధికారి కిషోర్, డీఏవో  బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

ఇంగ్లీష్​పై అవగాహనం కోసం  ఉద్దీపకం వర్క్ బుక్స్ 

పాల్వంచ  : ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు ఇంగ్లీషు పై అవగాహన కలిగించేందుకు రూపొందించిన ఉద్దీపకం వర్క్ బుక్స్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్ అన్నారు. బుధవారం మండలంలోని నాగారం తండా, తోగ్గూడెం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. 3వ తరగతి నుంచి 5వ తరగతి చదివే విద్యార్థుల కోసం ఉద్దీపకం వ ర్క్ బుక్స్ అందుబాటులోకి తెచ్చామన్నారు. 

ఇంగ్లీష్, గణితం చదవడం రాయడంలో వెనకబడిపోతున్నారని,  గణితంలో  ప్రాథమిక స్థాయి సంఖ్యల నుంచి కూడికలు, తీసివేతలు, గుణకారాలు, బాగాహారాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, చిత్రాలతో విద్యార్థి పాఠశాలల్లో ఆనందంగా ఆహ్లాదంగా నేర్చుకునేందుకు అనుకూలంగా ఉద్దీపన వర్క్​ బుక్స్​ ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏటీడీవో చంద్ర మోహన్, పీజీహెచ్ఎం బద్రు, ఎస్సార్పీ హరిలాల్, టీచర్లు సుజాత, పద్మ, రాంబాబు, పుల్లమ్మ పాల్గొన్నారు.