
- ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం, వెలుగు : ఏజన్సీ ప్రాంతంలోని నిరుద్యోగ యువత కోసం భద్రాచలం గ్రంథాలయంలో అధునాతన హంగులతో రీడింగ్ రూమ్ నిర్మిస్తున్నట్లు ఐటీడీఏ పీవో బి.రాహుల్ తెలిపారు. గురువారం గ్రంథాలయంలో నిర్మిస్తున్న రీడింగ్ రూమ్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ డీఎస్సీ, ఎస్సై, ఇతర గ్రూపులకు సంబంధించిన పుస్తకాలు, పాఠకులు విశాలంగా కూర్చుని చదువుకోవడానికి ఈ రూమ్ నిర్మిస్తున్నట్లు తెలిపారు.
దాతల సాయంతో ప్రస్తుతం ఈ గ్రంథాలయం నడుస్తోందని, కనీసం పుస్తకాలు కూడా లేవని నిరుద్యోగులు తన దృష్టికి తేవడంతో ఈ రీడింగ్ రూమ్ నిర్మిస్తున్నామని చెప్పారు. వారం రోజుల్లో ఈ రూమ్ పనులు పూర్తి చేసేలా ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ చంద్రశేఖర్‌ను ఆదేశించినట్లుగా తెలిపారు.