ఇంగ్లిష్, మ్యాథ్స్ లో కనీస సామర్థ్యాలు పెంచాలి : పీవో రాహుల్​

ఇంగ్లిష్, మ్యాథ్స్ లో కనీస సామర్థ్యాలు పెంచాలి : పీవో రాహుల్​
  • ఐటీడీఏ పీవో రాహుల్​
  • ఏజీహెచ్​ ఆశ్రమ పాఠశాలల సందర్శన 

భద్రాచలం, వెలుగు :  గిరిజన విద్యార్థులకు ఇంగ్లీషు, మ్యాథ్స్ ల్లో కనీస సామర్థ్యాలను పెంచాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ టీచర్లకు సూచించారు. శుక్రవారం ఆయన దుమ్ముగూడెం మండలంలోని రామచంద్రునిపేట, రేగుపల్లి ఏజీహెచ్​ ఆశ్రమ  పాఠశాలలను సందర్శించారు. వారి సామర్థ్యాలను పెంచేందుకు ప్రవేశపెట్టిన ఉద్దీపకం వర్క్ బుక్స్, వేదిక్​ మ్యాథ్స్ ల్లో చిన్నారుల ప్రతిభను టెస్ట్ చేశారు.

క్లాసులో ఆయన స్వయంగా కూర్చుని టీచర్లు చెప్పే పాఠాలను విన్నారు. క్లాసులో చెప్పినవి హాస్టల్​లో ప్రాక్టీస్​ చేయించాలని టీచర్లకు సూచించారు. ల్యాబ్​లను తనిఖీ చేశారు. మౌలిక వసతులకు సంబంధించిన రిపేర్లకు నిధులు కావలిస్తే ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు.