క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి : ఐటీడీఏ పీవో రాహుల్

క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి : ఐటీడీఏ పీవో రాహుల్

పాల్వంచ రూరల్,  వెలుగు : ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ సూచించారు. పాల్వంచ పట్టణ పరిధిలోని శ్రీనివాస కాలనీ మినీ స్టేడియంలో  ఆదివారం జిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అథ్లెటిక్స్ ఆర్చరీ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఈనెల 29న మేజర్ ధ్యాన్​చంద్ ఒలంపిక్ హాకీ క్రీడాకారుడు

 జన్మదినం  సందర్భంగా ఈ క్రీడలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. స్టూడెంట్స్​ చదువుతోపాటు క్రీడ రంగంలో కూడా రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ మహిందర్,  ఆర్చరీ కోచ్ కళ్యాణ్,  నాగేందర్,  ఇమామ్,  యుగంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.