​ మెడల్స్ సాధించేలా స్టూడెంట్స్​కు శిక్షణ ఇవ్వాలి : ఐటీడీఏ పీవో రాహుల్​

​ మెడల్స్ సాధించేలా స్టూడెంట్స్​కు శిక్షణ ఇవ్వాలి : ఐటీడీఏ పీవో రాహుల్​
  • ఐటీడీఏ పీవో రాహుల్​

భద్రాచలం, వెలుగు :  డివిజన్, జోనల్​స్థాయిలో క్రీడల్లో రాణించి స్టేట్​ లెవల్స్ కు ఎంపికైన విద్యార్థులు మెడల్స్ సాధించేలా స్పెషల్ ట్రైనింగ్​ ఇవ్వాలని గిరిజన ఆశ్రమ పాఠశాలల హెచ్​ఎంలు, వార్డెన్లు, పీడీలు, పీఈటీలను ఐటీడీఏ పీవో బి.రాహుల్​ ఆదేశించారు. ఐటీడీఏలో సోమవారం గిరిజన దర్బారులో పాల్గొన్న యూనిట్​ ఆఫీసర్లతో పాటు హెచ్​ఎంలు, వార్డెన్లు, పీడీలు, పీఈటీలతో ఆయన మాట్లాడారు. ఎంపికైన వారికి మంచి ఆహారం అందించడంతో పాటు, క్రీడల్లో మరిన్ని మెళకువలు నేర్పించాలని సూచించారు.

 అనంతరం గిరిజనుల నుంచి వినతులు స్వీకరించారు. పోడు భూములకు పట్టాలు ఆన్​లైన్​ చేయాలని, భూ సమస్యలు తీర్చాలని, చేపల సొసైటీల కోసం, స్వయం ఉపాధికి లోన్లు కావాలని, వ్యవసాయ బావులకు కరెంట్​ సౌకర్యం, బోరు, మోటారు, ట్రైకార్​ రుణాల ఇవ్వాలని ఇలా రకరకాల ఆర్జీలు పీవో వద్దకు వచ్చాయి. 

వీటిని పరిశీలించిన పీవో సంబంధిత యూనిట్​ ఆఫీసర్లకు పంపించారు. పరిశీలించి, అర్హత ప్రకారం ప్రాధాన్యతా క్రమంలో సమస్యలు పరిష్కరిస్తామని పీవో ఆర్జీదారులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్​రాజ్​, డీడీ మణెమ్మ, ఈఈ తానాజీ, ఏవో రాంబాబు తదితరులు పాల్గొన్నారు.