ట్రైబల్ మ్యూజియానికి టూరిస్టులను రప్పించాలి : ఐటీడీఏ పీవో బి.రాహుల్​

  •  ఐటీడీఏ పీవో బి.రాహుల్​

భద్రాచలం, వెలుగు :  టూరిస్టులు సందర్శించడానికి ట్రైబల్​ మ్యూజియాన్ని ముస్తాబు చేస్తున్నామని, టూరిస్టులను రప్పించేందుకు సకల సదుపాయాలు కల్పించాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ ​అధికారులను ఆదేశించారు. ట్రైబల్​ మ్యూజియం పనులను సిబ్బందితో కలిసి శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. సోలార్​ లైట్ల ఏర్పాటు గురించి ఆరా తీశారు.

 పిల్లలు ఆడుకునేందుకు వీలుగా అన్ని రకాల క్రీడాపరికరాలు సిద్ధం చేయాలన్నారు. స్టాల్స్, ఆదివాసీ వంటల తయారీ ప్రాంతాల వద్ద శానిటేషన్​ పనులు చేపట్టాలని గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాస్​ను ఆదేశించారు. పటిష్టమైన భద్రతను కల్పించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని సూచించారు. ఏపీవో జనరల్​ డేవిడ్​రాజ్​, ఈఈ చంద్రశేఖర్​ తదితరులు పీవో వెంట ఉన్నారు.

సోలార్​తో మోటార్ల ద్వారా సాగునీటి సప్లై 

భద్రాద్రికొత్తగూడెం :  సోలార్​తో మోటార్ల ద్వారా సాగునీటికి వాటర్​ను వినియోగించుకోవడం అభినందనీయమని ఐటీడీఏ పీవో రాహూల్​ పేర్కొన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం బొజ్జలగూడెం, లక్ష్మీపురం, బంగారు చెలక గ్రామాల్లోని రైతులు సోలార్​ ద్వారా మోటార్లను నడుపుతూ సాగు చేస్తున్న భూములను శుక్రవారం ఆయన పరిశీలించారు. సోలార్​ను ఉపయోగించి మోటార్ల ద్వారా రెండు పంటలు పండించుకుంటూ గిరిజనులు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.