మినీ మేడారం జాతరను సక్సెస్​ చేద్దాం : ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా

మినీ మేడారం జాతరను సక్సెస్​ చేద్దాం : ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా
  • ఆదివాసీ సంఘాల నేతల సమావేశంలో ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా

ఏటూరునాగారం, వెలుగు : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే మేడారం మినీ జాతరను సక్సెస్ చేసేందుకు సహకరించాలని ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా పిలుపునిచ్చారు. మంగళవారం ఐటీడీఏ ఆఫీసులో ఆదివాసీ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఆదివాసీ సంఘాల నేతలు పలు సూచనలు చేశారు. మినీ మేడారం జాతరకు ఆదివాసీ గ్రామాల్లో రోడ్లు, కరెంటు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని, ఆదివాసీ సంస్కృతి ప్రతిబించే ద్వారాలను ఏర్పాటు చేయాలని కోరారు. 

ఐటీడీఏ పరిధిలో 60 ఇలవేల్పులకు గుడి నిర్మాణాలు, గద్దెలు, పూజలకు ఖర్చులు అందించాలని పేర్కొన్నారు. ఐటీడీఏ పాలకమండలి సమావేశంలో చర్చించి ఆదివాసీ గూడేలను, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఏజెన్సీ చట్టాలు 1/70, ఆర్​వో ఎఫ్​ఆర్​, పెసా చట్టాలను అమలు చేసే విధంగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో డీడీ పోచం, ఈఈ వీరభద్రం, ఎస్​వో రాజ్​కుమార్, సురేశ్​బాబు, ఎస్ డీసీ డీటీ అనిల్, పెసా కో – ఆర్డినేటర్ కొమురం ప్రభాకర్,  ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.