పకడ్బందీగా పోస్టల్ బ్యాలెట్స్ నిర్వహించాలి : చిత్ర మిశ్రా

  •     అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా

ములుగు, వెలుగు: ఎంపీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో సెక్టోరల్ అధికారులు, పోస్టల్ బ్యాలెట్ టీమ్స్ కు పోస్టల్ బ్యాలెట్ పై ఆమె అడిషనల్​కలెక్టర్ మహేందర్ జీతో కలిసి శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ, నిబంధనలు, తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. 

ప్రతి ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఫ్లెక్సీ లు ఏర్పాటు చేసి ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం సంక్షేమ భవనం లో ఏర్పాటు చేయనున్న ఫెసిలిటేషన్ సెంటర్ ను సందర్శించారు. కార్యక్రమంలో ఆర్డీవో కె.సత్యపాల్ రెడ్డి, ఎమ్మార్వో విజయభాస్కర్, ఎలక్షన్ డీటీ విజయ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.