గుండాల, వెలుగు : విద్యార్థులు విద్యతో పాటు, క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించి ఉన్నత స్థాయికి ఎదగాలలని భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ అన్నారు. నల్లగొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాల గురుకులాల పాఠశాలల 7వ జోనల్ స్థాయి క్రీడలను అండర్ 14,15,19(బాలుర) క్రీడలను శుక్రవారం స్థానిక గురుకుల కళాశాలలో ఆయన ప్రారంభించారు.
అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ క్రీడలు మూడురోజుల పాటు నిర్వహిస్తారన్నారు. క్రీడాకారులు ఆటల్లో గెలుపొంది తమ పాఠశాలలకు గుర్తింపు తేవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్వో రాజు, తహసీల్దార్ రంగా, ఎంపీడీఒ సత్యనారాయణ, ప్రిన్సిపాల్స్ పీఈటీలు, సిబ్బంది పాల్గొన్నారు.