స్టూడెంట్లకు వైద్య పరీక్షలు చేయండి : ప్రతీక్​ జైన్​

స్టూడెంట్లకు వైద్య పరీక్షలు చేయండి : ప్రతీక్​ జైన్​

భద్రాచలం, వెలుగు :  వేసవి సెలవులు ముగిసి కొత్త విద్యా సంవత్సరం షురూ అవుతున్న వేళ హాస్టళ్లకు, ఆశ్రమ పాఠశాలలకు వస్తున్న స్టూడెంట్లకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఐటీడీఏ పీవో ప్రతీక్​ జైన్​ యూనిట్​ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రజాదర్బారు నిర్వహణకు ముందు యూనిట్​ ఆఫీసర్లతో సమావేశమై పలు సూచనలు చేశారు. 

స్టూడెంట్లు వాతావరణ మార్పుల వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని, వారి మానసిక స్థితిగతులను సంబంధిత హెచ్ఎం, వార్డెన్లు పరిశీలించి వైద్య చికిత్సలు చేయించాలన్నారు. అనంతరం ఆయన అర్జీలు స్వీకరించారు. పోడు భూములకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా రావడంతో వాటిని పరిష్కరించాలన్నారు.