స్కూళ్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలి

స్కూళ్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలి
  •     ఐటీడీఏ పీవో  ప్రతీక్ ​జైన్

పినపాక, వెలుగు : ట్రైబల్ వెల్ఫేర్​స్కూళ్లు,​ హాస్టళ్లలో సమ్మర్​హాలిడేస్​ అనంతరం తిరిగి ప్రారంభించేనాటికి అన్ని సౌకర్యాలు కల్పించాలని స్పెషల్​ ఆఫీసర్లు, హెడ్​మాస్టర్లను ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ ఆదేశించారు. శుక్రవారం పినపాక మండలంలోని ఎల్చిరెడ్డిపల్లి గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనఖీ చేశారు.

వేసవి సెలవులు ఇచ్చినప్పటి నుంచి స్కూల్​ఆవరణ, తరగతి గదులు శుభ్రం చేయకపోవడంతో హెడ్మాస్టర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 20లోపు స్కూళ్లలో అన్ని పనులు పూర్తి కావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ అశోక్, స్కూల్​ హెచ్ఎం సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు.