భక్తుల సౌకర్యాల కోసం స్పెషల్ ​ఆఫీసర్లు : ప్రతీక్​ జైన్

భద్రాచలం, వెలుగు :  ఈనెల 17న శ్రీరామనవమి సీతారాముల కల్యాణం, 18న మహాపట్టాభిషేకానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు స్పెషల్​ ఆఫీసర్లను నియమించామని ఐటీడీఏ పీవో ప్రతీక్​ జైన్​ తెలిపారు. శ్రీరామనవమి ఏర్పాట్లపై ఆయన శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్లు వారి విధులు సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖ ఎంతో కీలకంగా పనిచేయాలని, అవసరమైనన్ని మెడికల్​ క్యాంపులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. పూర్తి స్థాయిలో సిబ్బంది

మందులు, ఓఆర్​ఎస్​ ప్యాకెట్లు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. పాలిచ్చే తల్లులకు అవసరమైన ఏర్పాట్లు చూడాలన్నారు. క్లీన్ భద్రాద్రిని గ్రామపంచాయతీ బాధ్యతగా తీసుకోవాలని కోరారు. రౌండ్​ ది క్లాక్​ సిబ్బందితో వీధులన్నీ శుభ్రం చేయించాలని చెప్పారు. సమాచార కేంద్రాలు, చలివేంద్రాలు, వాటర్, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీకి సిద్ధం  చేయాలని సూచించారు. భద్రాచలంతో పాటు పర్ణశాలలో కూడా మరుగుదొడ్లు ఎక్కువగా నిర్మించాలన్నారు.

అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తేనే వేడుకలు సక్సెస్​ అవుతాయని చెప్పారు. ఈ టెలీ కాన్ఫరెన్స్​లో ఈవో రమాదేవి, భద్రాచలం ఆర్డీవో దామోదర్, డీఎం​హెచ్​వో శిరీష, ఆర్​డబ్ల్యుఎస్​ ఈఈ తిరుమలేశ్​తదితరులు పాల్గొన్నారు.