వాన నీళ్ల నిల్వతో అనేక ప్రయోజనాలు : ప్రతీక్​ జైన్​

భద్రాచలం, వెలుగు :  ఆదివాసీలు వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చని ఐటీడీఏ పీవో ప్రతీక్ ​జైన్​సూచించారు. భారత రూరల్​ లైవ్లీ హుడ్​ ఫౌండేషన్​ ద్వారా మంగళవారం నిర్వహించిన ఓరియంటేషన్​ ట్రైనింగ్​లో పీవో పాల్గొన్నారు. ఈజీఎస్​ ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్​ అసిస్టెంట్లు, పంచాయతీ సెక్రటరీలకు ఇస్తున్న ట్రైనింగ్​ను ఆయన పరిశీలించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ ఛత్తీస్​గఢ్​లో లక్ష మంది ఆదివాసీలు ఈజీఎస్​ ద్వారా చెక్​డ్యామ్​లు, కెనాల్స్, ఫెర్గూషన్​ ట్యాంకులు నిర్మించుకుని వర్షపు నీటిని నిల్వ చేసుకుని కూరగాయల పంటలు, మామిడి తోటలు, చేపల పెంపకం చేపట్టి లాభాలు పొందుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీవో జనరల్​ డేవిడ్ ​రాజ్, ఎస్వో సురేశ్ ​బాబు, ఆర్ఓఎఫ్​ఆర్​ డీటీ శ్రీనివాసరావు, భారత లైవ్లీ ఉడ్​ సభ్యులు సుమిత్​రాయ్​, అరవింద్​, మధుసూదన్, తివారీ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి కల్పించొచ్చు

ఆదివాసీ మహిళలు స్వశక్తితో పనిచేసి తమతో పాటు పదిమందికి ఉపాధి కల్పించొచ్చని ఐటీడీఏ పీవో ప్రతీక్​ జైన్​ అన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం ఓం శక్తి గ్రూపు ఆదివాసీ మహిళలు తయారు చేసిన సెంట్​ ఫినాయిల్​, సర్ప్, క్యాండిల్స్ వస్తువులను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 మంది ఆదివాసీలు గ్రూపుగా ఏర్పడి సీఆర్​పీఎఫ్​ 141 బెటాలియన్​ ఇచ్చిన శిక్షణను ఉపయోగించుకుని ఈ వస్తువులను తయారు చేయడం సంతోషంగా ఉందన్నారు. 

ఇంటి వద్దనే ఉంటూ పదిమందికి ఉపాధి కల్పిస్తూ వీటిని తయారు చేసి ఆర్థిక స్వావలంబన సాధిస్తున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. హాస్టళ్లకు, ప్రభుత్వ ఆసుపత్రులకు వీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని చెపారు. వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్​పీఎఫ్​ కమాండెంట్​ ప్రీతీ శ్రీ, గ్రూపు మహిళలు పాల్గొన్నారు.