పాల్వంచ రూరల్, వెలుగు : పాల్వంచ పట్టణ, మండలంలోని కిన్నెరసాని బాలుర ఆశ్రమ పాఠశాలను, పట్టణంలోని బాలుర వసతిగృహాన్ని ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలకు సెలవులు ముగిసి విద్యార్థులు పాఠశాలకు వచ్చేలోపు స్కూల్లో అన్ని సౌకర్యాలు క్పలించాలని సూచించారు.
వసతి గృహాల్లో మైనర్ రిపేర్లు, ఫ్యాన్వర్క్, డ్యూయల్ డెస్క్ రిపేర్లు ఈనెల 20లోపు పూర్తి చేయించాలని ఆదేశించారు. పాఠశాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కంప్యూటర్ల్యాబ్, సైన్స్ ల్యాబ్ వేర్వేరుగా ఉండాలని చెప్పారు. ఆయన వెంట డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి మణెమ్మ, హెచ్ఎం ఉన్నారు.
సమ్మర్ కోచింగ్ క్యాంపు షురూ..
పాల్వంచ మండల పరిధిలోని క్రీడా పాఠశాలలో గేమ్స్ సమ్మర్ కోచింగ్ ను ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా పాఠశాలలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మర్ క్రీడా శిక్షణా శిబిరాల్లో పాల్గొనే 60 మంది బాలురు, 60 మంది బాలికలతో ఆయన మాట్లాడారు. క్రీడల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని సూచించారు.
డిప్యూటీ డైరెక్టర్ మణెమ్మ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ క్రీడల అధికారి గోపాలరావు, కొమరం వెంకటనారాయణ, సీ. నాగేశ్వరరావు, ఎన్ చందు, తదితరులు ఉన్నారు.