
భద్రాచలం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లకు నాణ్యతతో కూడిన వంట సరుకులు, సీజనల్ పండ్లను సరఫరా చేయాలని ఐటీడీఏ పీవో రాహుల్ అధికారులను ఆదేశించారు. మీటింగ్ హాలులో శుక్రవారం టెండర్లను ఓపెన్ చేశారు. జిల్లా పర్చేజ్ కమిటీ, డీడీ, ఏపీవో జనరల్, ఏజన్సీ యజమానుల సమక్షంలో టెండర్ల ప్రక్రియను నిర్వహించారు. 19 గురుకుల పాఠశాలలు, 8 ఏకలవ్య స్కూళ్లలో చదివే స్టూడెంట్లకు పౌష్టికాహారం అందించాలన్నారు. 114 మంది టెండర్లలో పాల్గొనగా, తక్కువగా కోడ్ చేసిన ఏజన్సీలకే టెండర్లను అప్పగించినట్లు పీవో తెలిపారు.