
భద్రాచలం, వెలుగు : ట్రైబల్ మ్యూజియాన్ని అందంగా తీర్చిదిద్దాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఆఫీసర్లను ఆదేశించారు. వాల్పెయింటింగ్పనులు, గిరిజన వంటకాల స్టాళ్లనిర్మాణం, బాక్స్ క్రికెట్గ్రౌండ్ పనులు శనివారం నాటికి పూర్తి చేయాలన్నారు. మ్యూజియం పనులను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్న పిల్లలు బోటింగ్ పాండ్ పనులను జాగ్రత్తగా చేయాలన్నారు.
శ్రీరామనవమి నాడు మ్యూజియాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. పల్లె వాతావరణం ఉట్టిపడేలా పెయింటింగ్స్ ఉండాలన్నారు. మ్యూజియంకు లైటింగ్పెట్టాలని సూచించారు. పీవో వెంట ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, డీడీ మణెమ్మ, హార్టికల్చర్ఆఫీసర్ఉదయ్కుమార్, ఏసీఎంవో రమణయ్య, డీఈ హరీశ్ తదితరులు ఉన్నారు.
టర్ల సవరణ ప్రక్రియ పూర్తి చేయాలి
బూర్గంపహాడ్ : ఓటర్ల సవరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని పీవో రాహుల్ అన్నారు. బుధవారం బూర్గంపహాడ్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు. రాజీవ్ యువ వికాసం పథకం కోసం కులం సర్టిఫికెట్లు, ఆదాయం సర్టిఫికెట్లు, నివాసం ఇతర సర్టిఫికెట్లు అవసరం ఉంటుందని, ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే జాప్యం చేయకుండా సకాలంలో అందించాలని సూచించారు