స్టూడెంట్స్​కు పక్కాగా పౌష్టికాహారం అందించాలి : పీవో రాహుల్

కారేపల్లి, వెలుగు: సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, వండిన ఆహార పదార్థాలను రోజూ తనిఖీ చేయాలని ఐటీడీఏ పీవో రాహుల్ అధికారులకు సూచించారు. మండలంలోని గాంధీనగరం యూఆర్ జేసీ కాలేజీని బుధవారం పీవో సందర్శించారు. గురుకులంలోని పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల బోధన నైపుణ్యాలను ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ డి గ్రేడ్ విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు తీసుకువచ్చే ఆహార పదార్థాలు తప్పనిసరిగా ప్రత్యేక రికార్డులో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గురుకులం ఆర్సీవో నాగార్జున రావు, కళాశాల ప్రిన్సిపాల్ హరికృష్ణ పాల్గొన్నారు.

ఇంగ్లీషు అర్థమయ్యేలా బోధించాలి 

గుండాల : ప్రభుత్వం ప్రైమరీ నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టిన నేపథ్యంలో విద్యార్థులకు అర్థమయ్యేలా టీచర్లు పాఠాలు బోధించాలని పీవో సూచించారు. మండలంలోని శంభుని గూడెం సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన సందర్శించి ఇంగ్లీష్ పై విద్యార్థులకు ఉన్న పరిజ్ఞానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్  వెల్ఫేర్ డీడీ మణెమ్మ, ఇల్లెందు ఏటీడీవో రాధమ్మ, స్కూల్ హెడ్మాస్టర్​ రమేశ్​పాల్గొన్నారు.