భద్రాచలం, వెలుగు : జనవరి 4 నుంచి 6 వరకు పాల్వంచలోని కిన్నెరసాని స్కూల్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడలపై ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ తన చాంబరులో బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏటీడీవోలతో రివ్యూ నిర్వహించారు. 2వేల మంది రాష్ట్రం నలుమూలల నుంచి క్రీడాకారులు వస్తారని
వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భోజనం, వసతి, క్రీడాస్థలాలు సిద్ధం చేయాలన్నారు. క్రీడాస్థలాల్లో ఏమైనా రిపేర్లు అవసరమైతే ట్రైబల్వెల్ఫేర్ ఈఈ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. మీటింగ్లో డీడీ మణెమ్మ,ఈఈ తానాజీ పాల్గొన్నారు.