మధ్యప్రదేశ్​లో ‘ఐటెం’ వివాదం

కమల్​నాథ్​ వివరణ కోరిన ఎన్​సీడబ్ల్యూ

నిరసనగా బీజేపీ లీడర్ల మౌనదీక్ష
పేరు గుర్తురా కే ఆ పదం వాడా..
మాజీ సీఎం కమల్ నాథ్ వివరణ

న్యూఢిల్లీ, భోపాల్​: మధ్యప్రదేశ్​స్టేట్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌ ఇమర్తి దేవిని ‘ఐటమ్‌‌‌‌’ అని చేసిన కామెంట్స్‌‌‌‌పై వివరణ ఇవ్వాలని మాజీ సీఎం కమల్‌‌‌‌నాథ్‌‌‌‌ను ​నేషనల్‌‌‌‌ కమిషన్‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌ విమెన్‌‌‌‌ (ఎన్‌‌‌‌సీడబ్ల్యూ) ఆదేశించింది. స్టేట్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ను అవమానించేలా కామెంట్స్‌‌‌‌ చేసిన మధ్యప్రదేశ్‌‌‌‌ మాజీ సీఎం కమల్‌‌‌‌నాథ్​పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ‘ఒక లీడర్‌‌‌‌‌‌‌‌ అయ్యి ఉండి మహిళపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడం విచారకరం. మాజీ సీఎం ఉపయోగించిన పదాలు మహిళలను అవమానించేలా ఉన్నాయి. వారి గౌరవానికి భంగం కలిగిస్తాయి మహిళలు ఎక్కువ సంఖ్యలో రాజకీయాల్లోకి రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ సమయంలో ఒక మహిళా లీడర్‌‌‌‌‌‌‌‌ను, అది కూడా ఒక రెస్పాన్సిబుల్‌‌‌‌ హోదాలో పనిచేసిన వ్యక్తి ఇలాంటి కామెంట్స్‌‌‌‌ చేయడం బాధాకారం’ అని ఎన్‌‌‌‌సీడబ్ల్యూ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో చెప్పింది. దబ్రా నియోజకవర్గంలో జరిగిన ప్రచార సభలో కమల్‌‌‌‌నాథ్‌‌‌‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థి సింపుల్‌‌‌‌గా ఉంటారని, బీజేపీ అభ్యర్థి ఓ ఐటమ్‌‌‌‌ అని, ఆమె పేరు కూడా పలకడం తనకు ఇష్టం లేదని కామెంట్‌‌‌‌ చేశారు.

కామెంట్స్‌‌‌‌ను నిరసిస్తూ బీజేపీ లీడర్ల మౌనదీక్ష

ఇమర్తి దేవిపై కమల్‌‌‌‌నాథ్‌‌‌‌ కామెంట్స్‌‌‌‌కు నిరసనగా బీజేపీ లీడర్లు సోమవారం మౌనదీక్ష చేశారు. మధ్యప్రదేశ్‌‌‌‌ సీఎం శివ్‌‌‌‌రాజ్‌‌‌‌ సింగ్‌‌‌‌ చౌహాన్‌‌‌‌, ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర మంత్రి‌‌‌‌ నరేంద్ర సింగ్‌‌‌‌ తోమర్, ఇతర లీడర్లు పాల్గొన్నారు. భోపాల్‌‌‌‌లోని మింటో హాల్‌‌‌‌ వద్ద మౌన దీక్షను రెండు గంటలు కొనసాగించారు. కమల్‌‌‌‌నాథ్​కు దళిత మహిళను గౌరవించడం తెలియదని, సీఎం పోస్ట్‌‌‌‌ పోయినంక ఆయన మతిభ్రమించిందని ఇమర్తి దేవి అన్నారు.

ఆమె పేరు మర్చిపోయా: కమల్​నాథ్

‘ఐటెం’ కామెంట్​పై వివాదం రేగడంతో మాజీ సీఎం కమల్​నాథ్​ స్పందించారు. ఆ టైమ్​లో పేరు గుర్తురాకపోవడం వల్లే ఆ పదం ఉపయోగించానని, అందులో వేరే ఉద్దేశం ఏమీలేదని వివరణ ఇచ్చారు.

For More News..

బిడెన్.. చైనా మనిషి