బాలీవుడ్, టాలీవుడ్ మోస్ట్ ట్రెండింగ్ ఐటెం క్వీన్ గా తన సత్తా చాటుతోంది ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela). అందంతో, తన డ్యాన్స్తో కుర్రకారును ఊపేస్తున్న ఈ భామ ప్రస్తుతం వరుస ఐటెమ్ సాంగ్స్తో క్రేజీ సంపాదించుకొంది. లేటెస్ట్గా ఈ బ్యూటీ తన మ్యారేజ్ ఎలా జరగాలో డిసైడ్ చేసింది. ఇక ఎవరి మ్యారేజ్ అయినా వారి సంప్రదాయ ప్రకారం ఒకేసారి,ఒకేచోట చేసుకుంటారు. ఏడురకాలుగా ఎవరైనా చేసుకుంటారా? అసలు అలాంటి ప్లానింగ్ ఎవరికైనా ఉంటుందా?
ఊర్వశీ రౌతేలా తన మ్యారేజ్ రెండు..మూడు పద్దతుల్లో కాకుండా ఏకంగా 7 రకాలుగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందట. బీచ్ లో ఒకసారి.. బెంగాలీ సంప్రదాయంలో మరోసారి.. క్రైస్తవ..హిందు సంప్రదాయాల్లో..థీమ్ బేస్డ్ గా..డెస్టినేషన్ వెడ్డింగ్..క్రూజ్..ఇలా మొత్తం ఏడు రకాలుగా చేసుకుని చరిత్రలోకి ఎక్కుతానంటోంది. అలాగే తనకి కాబోయే భర్త ఎలా ఉండాలో..తనకి ప్రత్యేక అభిప్రాయాలూ ఉన్నాయని తెలిపింది. వాటికి తప్పకుండా ఆ కుర్రాడు మ్యాచ్ అవ్వాల్సిందేనట. ఆ విషయంలో రాజీ పడే ప్రశక్తే లేదంటోంది. మరి ఇలా ఇన్ని రకాలుగా సంతృప్తి పరిచే ఆ వరుడు ఎక్కడ ఉన్నాడో? ఎప్పుడు తారసపడతాడో? ఎలా ఉంటాడో? వేచి చూద్దాం అంటున్నారు నెటిజన్స్. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్ గా పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది.ఊర్వశీ 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె 'సనమ్ రే' (2016), 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' (2016), 'హేట్ స్టోరీ 4' (2018), మరియు 'పాగల్‌పంటి' (2019) వంటి చిత్రాలలో నటించింది.
2012లో మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచి, అదే సంవత్సరం మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు ఆమె బాగా ప్రసిద్ధి చెందింది. ఇక రీసెంట్ గా తెలుగులో బ్రో, వాల్తేరు వీరయ్య, ఏజెంట్ మూవీస్ లో హైటెమ్ సాంగ్స్ తో బాగా ఫేమస్ అయింది.