హైదరాబాద్, వెలుగు: ఐటీఐ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐటీఐ ఏఎంసీ) ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీలకు చెందిన టాప్ 250 కంపెనీలలో పెట్టుబడి పెట్టే ఓపెన్-ఎండ్ స్కీమ్ అయిన ఐటీఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది.
ఈ పథకం కోసం ఈ నెల 21 నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఫండ్‌ని విశాల్ జాజూ, రోహన్ కోర్డే నిర్వహిస్తారు. ఈ రంగంలో వీళ్లకు 13 ఏళ్లకుపైగా అనుభవం ఉందని ఐటీఐ తెలిపింది. పథకం కోసం కనీస దరఖాస్తు మొత్తం రూ. 5,000. అయితే పెట్టుబడిదారులు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్)రూట్ ద్వారా కనీసం రూ. 500తో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్‌కు ఎలాంటి ఎంట్రీ లోడ్ ఛార్జీలు ఉండవు కానీ, 0.5శాతం ఎగ్జిట్ లోడ్ వర్తిస్తుంది.