ITR return filing: కార్పొరేట్ ట్యాక్స్ పేయర్స్కి గుడ్న్యూస్..ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగింపు

అసెస్ మెంట్ ఇయర్ 2024--25 సంవత్సరానికి గాను కార్పొరేట్ ట్యాక్స్ పేయర్స్ ఆదాయపన్ను రిటర్న్ లను దాఖలు చేయడానికి గడువును సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) పొడిగింది. నవంబర్ 15 వరకు ఐటీఆర్ పైలింగ్ చేసుకోవచ్చని తెలిపింది. ఇంతకుముందు అక్టోబర్ 31 వరకు ఉండగా.. మరో 15 రోజులు పొడిగించింది. 

ఇటీవల పన్ను ఆడిట్ రిపోర్టు సబ్మిషన్ కు గడువును సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 7, 2024కి పొడిగించారు. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 139లోని సబ్-సెక్షన్ (1) కింద కవర్ చేయబడిన పన్ను చెల్లింపుదారులకు పొడిగింపు వర్తిస్తుంది.

ALSO READ | Yes Bank ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్..సెప్టెంబర్ త్రైమాసికంలో భారీ లాభాలు..

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. నిర్దిష్ట పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను ఆడిట్‌ను నిర్వహించవలసి ఉంటుంది. సాంప్రదాయకంగా అసెస్‌మెంట్ సంవత్సరంలో సెప్టెంబర్ 30 నాటికి నివేదిక ఇవ్వాలి.