ITR Return: ఏ ఐటీ రిటర్న్ ఫార్మేట్ వేగంగా ప్రాసెస్ చేయబడుతుంది?.. వివరాలివిగో

ITR Return: ఏ ఐటీ రిటర్న్ ఫార్మేట్ వేగంగా ప్రాసెస్ చేయబడుతుంది?.. వివరాలివిగో

2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ITR) దాఖలుకు గడువు జూలై 31, 2024తో ముగిసింది. ఫైలింగ్ వ్యవధి ముగియడంతో చాలా మంది టా క్స్ పేయర్స్ ఇప్పుడు తమ రీఫండ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే రిటర్న్‌లు దాఖలు చేసిన ప్రతి ఒక్కరికీ వారి వాపసు ఇంకా అందలేదు. ఈక్రమంలో ఐటీ చెల్లింపుదారుల్లో చాలా సందేహాలు ఉన్నాయి. ఏ ఐటీ రిటర్న్ ఫార్మేట్ వేగంగా ప్రాసెస్ చేయబడుతుంది వంటి చాలా డౌట్స్ ఉన్నాయి. టాక్స్ పేయర్స్ సమ ర్పిం చిన ITR ఫారమ్  రకం, రిటర్న్ సంక్లిష్టతతో సహా అనేక అంశాల ఆధారంగా ఐటీ రిటర్న్ ల ప్రాసెస్ సమయం మారుతుంది. 

టాక్స్ పేయర్స్ సమర్పించిన ITR ఫారమ్  రకం, రిటర్న్ సంక్లిష్టతతో సహా అనేక అంశాల ఆధారంగా ఐటీ రిటర్న్ ల ప్రాసెస్ చేయడానికి ఆదాయపన్ను శాఖ తీసు కునే సమయం ఐటీఆర్ ఫారమ్ రకాన్ని బట్టి సమయం మారుతుంది. దీనికి మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది. అయితే  అదే రోజు లేదా ఒక నెల లోపు రిటర్న్ ప్రాసెస్ చేయబడిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఇది ఉండవచ్చు. ప్రాసెసింగ్ సమయం ఎక్కువగా ఆదాయపు పన్ను శాఖ విచక్షణ , సమర్థతపై ఆధారపడి ఉంటుంది అని చార్టర్డ్ అకౌంటెంట్ నిపుణులు  చెబుతున్నారు. 

ITR ప్రాసెసింగ్ కోసం పట్టే సమయం

ట్యాక్స్ పేయర్స్ సమర్పించే ITR  ఫారమ్ లు ITR 1, ITR 2, ITR3  మూడు రకాలు. వీటికి పట్టే సమయం గురించి తెలుసుకుందాం. 
ITR-1 : ఈ ఫారమ్ జీతం, ఇంటి ఆస్తి , ఇతర వనరుల నుంచి ఆదాయాన్ని ఆర్జించే వ్యక్తుల కోసం, వారి మొత్తం ఆదాయం రూ. 50 లక్షలు ఉంటే ITR 1 ఫారం ఫైల్ చేస్తారు. సాధారణంగా ITR-1ని ఉపయోగించి దాఖలు చేసిన రిటర్న్‌లు 10 రోజులలోపు ప్రాసెస్ చేయబడతాయి.రీఫండ్‌లు సాధారణంగా 15 రోజులలోపు అందు తాయి.

ITR-2 : మూలధన లాభాలు, ఇతర వివరణాత్మక సమాచారంతో సహా ఆదాయం ఉన్న వ్యక్తులు ఈ ఫారమ్‌ను ఉపయోగిస్తారు. ITR-2 ప్రాసెసింగ్ సమయం సాధారణంగా 20 నుంచి 45 రోజుల వరకు ఉంటుంది. అదనపు వివరాల ధృవీకరణకు మరింత సమయం అవసరం.

ITR-3: ఈ ఫారాన్ని వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (HUFలు) వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం ఉన్నవారు ఉపయోగిస్తారు. ITR-3 ప్రాసెసింగ్ సమ యం సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. డేటా సంక్లిష్టత ఆధారంగా 30 నుంచి 60 రోజులు పడుతుంది.

ఎంచుకున్న ఫారమ్, ITR సంక్లిష్టత, క్లెయిమ్ చేసిన తగ్గింపులు/మినహాయింపుల మొత్తం.. క్లెయిమ్‌లు ఫారమ్ 16లో పొందుపరచబడ్డాయా అనే వాటితో సహా అనేక అంశాల ఆధారంగా ITR ప్రాసెసింగ్ సమయం మారుతూ ఉంటుంది. 

ITR-1 వంటి ఫారం..నేరుగా ఆదాయ వనరులను కలిగి ఉన్న వ్యక్తులు ఉపయోగించేవి. ఇది ITR-3 కంటే వేగంగా ప్రాసెస్ చేయబడతాయి. ఇవి వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం కలిగిన వ్యక్తులు, HUFలచే ఉపయోగించబడతాయి.