- 40 మందికి చేరిన కుటుంబసభ్యుల సంఖ్య
గంగాధర, వెలుగు: కరీంనగర్జిల్లా గంగాధర మండలం చెర్లపల్లి (ఆర్) గ్రామానికి చెందిన105 ఏండ్ల అవ్వ అమిరిశెట్టి లచ్చమ్మ బర్త్ డే వేడుకలను కుటుంబసభ్యులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. లచ్చమ్మకు ఒక కొడుకు, ముగ్గురు బిడ్డలుండగా వారి పిల్లలు..పిల్లల పిల్లలు కలిసి మొత్తం సంఖ్య 40కి చేరింది.
ఈ సందర్భంగా లచ్చమ్మ మాట్లాడుతూ తాను 1919లో పుట్టానని గుర్తుందని, తనకు ముగ్గురు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారంది. కొంతకాలం క్రితం భర్త, పెద్ద తమ్ముడు, పెద్ద చెల్లెలు చనిపోయారని, తనకు 105 ఏండ్లు వచ్చినా బీపీ, షుగర్, కంటి చూపు, వినికిడి సమస్యలు లేవని చెప్పింది. 20 ఏండ్లుగా పగటిపూటంతా ఇంటి ముందున్న వేప చెట్టు కింద కుర్చుంటానని, మంచి గాలి పీల్చడమే తన ఆరోగ్య రహస్యం కావచ్చని చెబుతోంది.